పనికిమాలిన ప్రోగ్రామ్ బిగ్‌బాస్‌

ఏలూరు, (పశ్చిమ గోదావరి జిల్లా) : ఆశ్లీల దృశ్యాలు, అసభ్య సంభాషణలతో మహిళలను కించపరిచే విధంగా ఉన్న ‘‘స్టార్‌మా’’ టివి ఛానల్‌ల్లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ రియాల్టీషోను వెంటనే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్‌ చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ పిచ్చుక ఆదిశేషు, జిల్లా కోకన్వీనర్‌ పత్తిపాటి రామకృష్ణలు నేడొక ప్రకటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. స్టార్‌ మా ఛానల్‌లో జూనియర్‌ ఎన్‌టిఆర్‌ అట్టహాసంగా ప్రారంభించిన బిగ్‌బాస్‌ రియాల్టీషోను పనికిమాలిన కార్యక్రమంగా వారు అభివర్ణించారు. బిగ్‌బాస్‌ షోలో 32వరోజు జరిగిన కార్యక్రమంలో మగవాళ్లకు ఆడవాళ్లు, ఆడవాళ్లకు మగవాళ్లు మసాజ్‌ చేయటం, చంకు గీయించుకోవటం, మహిళ నటులు మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా బరితెగించి మాట్లాడటం సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునే విధంగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతకు ముందెన్నడూ ఇంత చెత్త ప్రొగ్రాంలో ఏ ఛానల్‌లో రాలేదని రేటింగ్‌ కోసమే ఇటువంటి ప్రొగ్రామ్స్‌ నిర్వహిస్తున్నారని వెంటనే ఈ ప్రొగ్రామ్‌ను నిలిపివేయాలని కేంద్ర, రాష్ట్ర సమాచార మంత్రిత్వశాఖను వారు కోరారు. దీని వలన సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారని వారు ప్రశ్నించారు. ఈ యొక్క ప్రసారాన్ని అభ్యుదయవాదులందరూ ఖండించాలని వారు కోరారు. ఈ పనికిమాలిన ప్రొగ్రామ్‌ని వెంటనే నిలిపివేయాలని తమ వంతు కృషి చేయాలని వారు కోరారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *