బాబు బిసి హక్కులను కాలరాస్తున్నారు

గోపాలపురం, (పశ్చిమ గోదావరి జిల్లా): ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలు పర్చకపోగా బిసి హక్కులను కాలరాస్తున్నారని బిసి ప్రజాసంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గూడూరి వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక గౌడపేట రామాలయం వద్ద మంగళవారం ఇళ్ల భాస్కరరావు అధ్యక్షతన బిసి కులలా ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న గూడూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మంత్రులు, ప్రజలు అందరికీ సమానంగా చూడాల్సిన మంత్రులు బహిరంగ సభల్లో బిసికు నష్టం కలిగించేలా మాట్లాడుతున్నారని అన్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంగానే అని ఆయన అన్నారు. కాపులను బిసిల్లో చేర్చే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం మంజునాథ్‌ కమీషన్‌ వేసారని , కమీషన్‌ 13 జిల్లాలోనూ శాంపిల్‌ సర్వే చేసిందని సర్వే రిపోర్టును ప్రభుత్వానికి ఇవ్వకుండా నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. కాపులను బిసిలో చేర్చే బాధ్యత మాదంటూ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారని ఇది ఖచ్చితంగా బిసిలకు నష్టం కలిగించేలా ఉందని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి టిడిపికి ఉన్న ఓట్లు తేడా కేవలం 5 లక్షలు మాత్రమేనని చంద్రబాబు గుర్తు చేసుకోవాన్నారు. 54 శాతం ఉన్న బిసిలు ఓట్లు వేస్తే గెలిచిన టిడిపి గద్దెనెక్కిన తర్వాత బిసిలకు అన్యాయం చేస్తుందని దుయ్యబట్టారు. 2019 ఎన్నికల్లో బిసిలకు న్యాయం చేసే పార్టీకి మాత్రమే మద్దతు ఉంటుందన్నారు. కాపులను బిసిల్లో కలిపే ప్రక్రియను విరమించుకోకపోతే ఉద్యమాలు తప్పవని గూడూరి హెచ్చరించారు. అనంతరం పార్లమెంట్‌ సెక్షన్‌ కమిటీ ముందు తమ డిమాండ్లను తెలియజేస్తున్నట్లు చెప్పారు. త్వరలో విజయవాడలో బిసి సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. బిసి నాయకులు చింతపల్లి వెంకటేశ్వరరావు, తానింకి గంగరాజు, కొండా వెంకటేశ్వరరావు, అనుపోజు రాంబాబు, కాసాని సోమరాజు, మైనం గవరయ్య, ఆర్‌ శ్రీను, రొంగ సత్యనారాయణ, తేలే వెంకటేశ్వరరావు, పంది ప్రకాశం, మైనం శ్రీనివాసరావు, బెజవాడ మోహనరావు మండలంలోని వివిధ బిసి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *