అతి శుభ్ర ‘మహానుభావుడు’

ఒకప్పుడు హీరోకు అన్నీ మంచి క్షణాలే ఉండేవి. హీరోను అత్యంత బలవంతుడిగా.. ఏ లోపాలు లేని వాడిగా చూపించేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో ట్రెండు మారింది. హీరోలకు చాలా అవలక్షణాల్నే ఆపాదిస్తున్నారు. మధ్యలో ‘బాబు బంగారం’తో గాడి తప్పిన మారుతి.. మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కేందుకు మళ్లీ ‘భలే భలే..’ మార్గాన్నే ఎంచుకున్నాడు. అంటే హీరోలను పెద్ద లోపం ఉన్వాడిగా చూపిస్తున్నాడు. ‘భలే భలే..’లో నాని మతిమరుపు వాడైతే.. మారుతి కొత్త సినిమా ‘మహానుభావుడు’లో హీరో శర్వానంద్‌ ఓసీడీతో బాధపడే కుర్రాడిగా నటిస్తున్నాడు. ఓసీడీ అంటే.. అతి శుభ్రతతో బాధపడే ఒక డిసార్డర్‌ అన్నమాట. దీంతో బాధపడేవాళ్లకు దేన్నయినా అతిగా శుభ్రం చేయడం.. అపరిశుభ్రత గురించి తెగ కంగారు పడటం అలవాటు. ‘భలే భలే..’లో మతిమరుపు కాన్సెప్ట్‌ లాగే ఇది కూడా హిలేరియస్‌గా వర్కవుటైనట్లే కనిపిస్తోంది ‘చివరికి హీరోయిన్‌ ముద్దివ్వబోతుంటే బ్రష్‌ చేశావా అనే స్థాయికి చేరుతుంది అతడి పిచ్చి. మొత్తానికి ‘మహానుభావుడు’ టీజర్‌ చూస్తే.. మారుతి ఈజ్‌ బ్యాక్‌ అనే అనిపిస్తోంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *