అనుమతు లేకుండా విలువైన చెట్లు నరికివేత

పట్టించుకోని ఆర్‌అండ్‌బి అధికారులు—-
దిమ్మను అడ్డుకున్న రైతులు—-
గోపాలపురం, (పశ్చిమ గోదావరి జిల్లా): మండలంలోని చిట్యాల నుంచి పెద్దాపురం, గోపాలపురం వరకూ రోడ్డు మార్జిన్‌లో ఉన్న పెద్దపెద్ద వృక్షాలను ఎటువంటి అనుమతులు లేకుండా నరికివేసి తరలించుకుపోతున్నారు. పెద్దాపురం వద్ద మంగళవారం సదరు కూలీలను నిలదీయగా హైటెన్షన్‌ విద్యుత్‌వైర్లు వేయడానికి చెట్లు తొలగిస్తున్నట్లు చెప్పారు. దీంతో పెద్దాపురం, వేళ్లచింతగూడెం గ్రామాలకు చెందిన రైతులు నరికిన చెట్లను తీసుకువెళ్లడానికి వీలులేదని నరికిన పెద్దపెద్ద దిమ్మలను అడ్డుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు తొలగింపుకు వేలం నిర్వహించకుండా సుమారు 25 పెద్ద పెద్ద వృక్షాలను నరికి అక్రమంగా తరలిస్తున్నారని తహశీల్దార్‌ ఎన్‌ నరసింహమూర్తికి, ఆర్‌అండ్‌బి అధికారులకు ఫిర్యాదు చేసారు. రోడ్డుమార్జిన్‌లోని చెట్లకు సుమారు రూ 2 లక్ష వరకూ ఆదాయం వస్తుందని చెట్లు మొత్తం ఆర్‌అండ్‌బి అధికారులు దళారులతో కుమ్మక్కై చెట్ల సొమ్మును కాజేస్తున్నారని ఆరోపించారు. చెట్లు నరికివేతకు సంబంధించి విద్యుత్‌ అధికారులకు ఎటువంటి సమాచారం లేదని ఎలక్ట్రికల్‌ ఏడీఈ ఏపి చంద్రశేఖరరావు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత ఆర్‌అండ్‌బి అధికారులు స్పందించి నరికిన చెట్లకు సంబంధించి తరలించిన వారిపై చర్యలు తీసుకుని ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చాలని రైతులు కోరుకుంటున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *