జీరో సైజ్‌కి రాశి…!

సౌత్‌ హీరోయిన్స్‌లో బబ్లీ గర్ల్‌ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రాశి ఖన్నా. ఊహలుగుసగుసలాడే లాంటి సింపుల్‌ లవ్‌ స్టొరీతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ కుర్రాళ్ళ మనసులను ఇట్టే దోచేసుకుంది. అందరి హీరోయిన్స్‌లా కాకుండా తన అందాలు చాలా ప్రత్యేకమని బబ్లీ గర్ల్‌గా పేరు తెచ్చుకుంది. వచ్చిన కొద్ది రోజుకే గ్లామరస్‌ పాత్రకు ఒకే చేస్తూ.. దాదాపు టాలీవుడ్‌ హీరోందరితో సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ అమ్మడి అందంతో ఎలాంటి ఇబ్బంది రాలేదు కానీ రీసెంట్‌గా వచ్చిన కొన్ని ఆఫర్స్‌ కోసం సైజును తక్కించుకోవలని చెప్పడంతో తను వెయిట్‌ లాస్‌ కోసం తెగ శ్రమించి దాదాపు జీరో సైజ్‌కి వచ్చిందట ఇంకా ఫుల్‌ ఫిట్‌ గా ఉండాలని ఛాలెంజ్‌గా తీసుకొని సరికొత్తగా కనిపించబోతోందట ఈ అందాల తార. ఇప్పటికే తన అందంతో తనకంటూ ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ తన సరికొత్త అందాలతో ఇంకా ఎంతమందిని పడేస్తుందో చూడాలి. ఆల్రెడీ బాగానే తగ్గిపోయిందిలే. ఇక ఈ అమ్మడు చేస్తున్న చిత్రాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్‌- జై వకుశ సినిమాతో పాటు మాస్‌ మహా రాజా రవి తేజ – టచ్‌ చేసి చూడు సినిమాల్లో నటిస్తోంది. అలాగే కొన్ని తమిళ-మలయాళం సినిమాతో పాటు మెగా హీరో వరుణ్‌ తేజ్‌ సినిమాలో కూడా ఛాన్స్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *