బుజ్జిగాడి భామ మోసపోయింది

బుజ్జిగాడు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటరైంది కన్నడ సుందరి సంజన. ఏడాది ఒకటి – రెండు సినిమాలు చేసిన అవెప్పుడు వచ్చింది.. ఎప్పుడెళ్లిందో ప్రేక్షకులకు గుర్తు కూడా లేదు. దీంతో సొంత ఊరు బెంగుళూరుకు రిటర్న్‌ అయిపోయి కాస్తో కూస్తో పేరు తెచ్చిపెట్టిన శాండల్‌ వుడ్‌ లోనే సెటిలైపోయింది. రీసెంట్‌ గా కర్నాటకలో ఓ చిట్‌ ఫండ్‌ కంపెనీ బోర్డు తిప్పేసింది. బెంగుళూరులోని ప్రసిద్ధి చిట్‌ ఫండ్స్‌ 300 మంది కుటుంబాలను మోసం చేసి రూ. 17 కోట్ల వరకు స్వాహా చేసింది. ఇందులో మోసపోయిన బాధితుల్లో సంజన కూడా ఉంది. బాధితుల్లో తన పేరు ఉందని బయటకు వచ్చినా తానేం పట్టించుకోనని.. ఈ విషయంలో సోషల్‌ మీడియా ద్వారా మరింత మందికి చేరాలని కోరుకుంది. గవర్నమెంట్‌ రిజిస్టర్డ్‌ కంపెనీ అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. చిట్‌ ఫండ్‌ కంపెనీలో డబ్బు పెట్టి మోసపోయానని చెప్పుకుంటూ పోస్టులు పెట్టడం బాధగానే ఉన్నా అంతకు మించి ఛాయిస్‌ లేకుండా పోయిందని బాధగా చెబుతోంది. సంజన ఇలా ఫైనాన్షియల్‌గా మోసపోయి మరోసారి వార్తల్లోకొచ్చింది. అయితే ఈ వ్యవహారంలో తాను ఎంత నష్టపోయిందీ మాత్రం సంజన రివీల్‌ చేయలేదు. జస్ట్‌ నష్టపోయాననే విషయం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *