చలామణీలోకి రూ. 200 నోటు

ముంబయి: శుక్రవారం నుంచి కొత్త రూ.200 నోటు చలామణీలోకి రానున్నట్లు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. నవంబరు 8 పెద్ద నోట్ల రద్దు తర్వాత విడుదల కానున్న మూడో నోటు ఇది. కొత్తగా విడుదల కానున్న ఈ నోటు పసుపు రంగులో ఉంది. నోటు వెనుక భాగాన భారతదేశ సంప్రదాయలు వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా సాంచీ స్తూపం బొమ్మను ముద్రించారు. ఈ నోటు ఎంపిక చేసిన కొన్ని బ్యాంకు, ఆర్బీఐ కార్యాయాల్లో రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. పెద్ద నోట్ల అక్రమ నిల్వ, వాణిజ్యానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా రూ.200 నోట్లను తెరపైకి తీసుకొస్తున్నారు. రూ.100, రూ.500 మధ్య మరో కరెన్సీ నోటు ఇప్పటి వరకూ లేదు. దీంతో రూ.200 నోటు మంచి ఆదరణ పొందుతుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. పెద్ద నోట్ల తర్వాత ఎదురవుతున్న చిల్లర సమస్యను కూడా రూ.200 నోటు కారణంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అక్రమ నగదు చెలామణీ.. నకిలీ కరెన్సీ నోట్లకు అడ్డుకట్ట వేసేందుకు రూ.200 నోటును ముద్రిస్తున్నట్లు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *